4th వార్షికోత్సవం

4th వార్షికోత్సవం
మన “లిటిల్ హార్ట్స్ సేవా యువత ” నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నిన్న అనగా (18-11-2020) బుధవారం “లక్కవరం ఓల్డ్ ఏజ్ హోమ్” లో మల్కిపురం SI నాగరాజు గారు మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించి లిటిల్ హార్ట్స్ సేవా యువత వెబ్ సైట్ ని లాంచ్ చేశారు తరువాత కేక్ కటింగ్ చేసి లిటిల్ హార్ట్స్ సేవా యువత గ్రూప్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు తదుపరి కార్యక్రమం గా ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్దులకు పళ్ళు మరియు బ్రెడ్ అందించడం జరిగింది .. నాలుగు పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగింది..

Read more

48 వ సేవ కార్యక్రమం

48_వ_సేవ_కార్యక్రమం

అమలాపురం జనపెల్లికి చెందిన ఆనంద్ కాళ్లు తిమ్మిర్లు తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్లారు డాక్టర్లు పరీక్ష చేసి వెన్నుపూస క్యాన్సర్ గా గుర్తించారు అయితే ఈ క్యాన్సర్ ఆరోగ్య శ్రీ లో రాదు 1,50,000 రూపాయిలు ఆపరేషన్ కి ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారు కానీ వల్ల నాన్నగారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆనంద్ మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు వీరిది నిరుపేద కుటుంబం కావడంతో లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి సహాయం కోరగా ఈ రోజు “#లిటిల్_హార్ట్స్_48_వ_సేవ_కార్యక్రమంలో ఆనంద్ కి 10,000 రూపాయిలు చెక్ ” అందించడం జరిగింది.
Read more

47 వ సేవ కార్యక్రమం

47 వ సేవ కార్యక్రమం
మలికిపురం మండలం లక్కవరం గ్రామం NTR కాలనీ లో నివాసం ఉంటున్న “షేక్ లాల్ బీబీ” గారికి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల డయాలసిస్ చేయించుకుంటున్నారు వీరిది నిరుపేద కుటుంబం కావడంతో లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి సహాయం కోరగా ఈ రోజు “47_వ_సేవ_కార్యక్రమలో ఆమె భర్త సుర్జన్ షేక్ గారికి 10,000 రూపాయిలు చెక్ ” అందించడం జరిగింది. Read more

46 వ సేవ కార్యక్రమం

46 వ సేవ కార్యక్రమం
గుండెపోటుతో రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ I.C.U లో చికిత్స పొందుతున్నా రాజోలు మండలం కూనవరం గ్రామానికి చెందిన లక్కోజు రాంబాబు గారికి #లిటిల్_హార్ట్స్_46వ_సేవ_కార్యక్రమం లో 10,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది..
Read more

44 వ సేవ కార్యక్రమం

44 వ సేవ కార్యక్రమం
మలికిపురం మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన జిల్లెల్ల సమిత్ అనే 2 సంవత్సరాల బాబు బొన్ మేర ఫెయిల్యూర్ అవ్వడంతో ప్లేట్లెట్స్ ప్రాబ్లం వచ్చింది 8 నెలల వయసు నుండి ఆ బాబుకి ఈ ప్రాబ్లమ్ ఉంది అప్పటినుండి చాలా హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి తండ్రి జిల్లెల్ల దిరేశ్ బాబు కొడుకుకి వైద్యం చేయించారు ప్రస్తుతం సమిత్ ఆపరేషన్ జరిగినప్పటికీ చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వాటికి వైద్యం చేయించుకోవడానికి కనీసం అప్పులు కూడా దొరక్క ఆ తండ్రి పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు ఈ విషయం తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత #లిటిల్_హార్ట్స్_44వ_సేవా_కార్యక్రమంలో వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు

Read more

43 వ సేవ కార్యక్రమం

43 వ సేవ కార్యక్రమం
మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామానికి చెందిన పడాల A V సత్యనారాయణ గారు ఇతనికి ఇద్దరు అమ్మాయిలు వారికి భర్తలు లేరు ప్రస్తుతం వీళ్ళు మలికిపురం మండలం వి వి మేరక లో నివాసం ఉంటున్నారు కొంత కాలం క్రితం సత్యనారాయణ గారికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది తరువాత ఏ పని చేయలేని పరిస్థితి కుటుంబ పోషణ భారంగా మారింది ఈ కుటుంబానికి జీవన ఉపాధి కల్పించడం కోసం #లిటిల్_హార్ట్స్_43వ_సేవా కార్యక్రమం లో “కుట్టు మిషన్” అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు

Read more

42 వ సేవ కార్యక్రమం

42 వ సేవ కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొడ్డు విజయ కుమారి గారి భర్త కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో కి వెళ్ళిపోయింది

Read more

41 వ సేవ కార్యక్రమం

41 వ సేవ కార్యక్రమం
సఖినేటిపల్లి మండలం v,v మెరక, గుర్రం వారి పేట లో నివాసముంటున్న గుర్రం పల్లయ్య గారి తాటకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా ధగ్నమైనది కట్టుబట్టలు కుడా మిగలలేదు ,చాలా నిరుపేద కుటుంబం ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు వారు మానసిక వికలాంగులు వీరి కుటుంబానికి లిటిల్ హార్ట్స్ #41_వ_సేవ_కార్యక్రమంలో ఈరోజు 2,500 విలువ గలా నిత్యావసర సరుకులు అందించ్చడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు.
 

Read more

40 వ సేవ కార్యక్రమం

40 వ సేవ కార్యక్రమం
ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెం గ్రామానికి చెందిన
 
నల్లా చంద్రశేఖర్(42 సంవత్సరాలు) ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధికి గురయ్యారు వారికి లిటిల్ హార్ట్స్ సేవయువత తరుపున ఈ రోజు 15,000 రూపాయలు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ టీం పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి ధన్యవాధాలు
 

Read more

39 వ సేవ కార్యక్రమం

39 వ సేవ కార్యక్రమం
పాలకొల్లు కి చెందినా “కటకంశెట్టి వెంకటేశ్వరి” గారికి రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి ఈమెకు భర్త లేరు ఒక్క అబ్బాయి ఉన్నాడు పాలకొల్లులో ఒక షాప్ లో అకౌంటర్ గా పని చేస్తున్నాడు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు అద్దెకి ఉంటున్నారు ఆరోగ్యశ్రీ లో వెంకటేశ్వరి గారికి ఉచితం గా ఆపరేషన్ చెసిన మందులకి 20 వేలు వరుకు ఖర్చు అవుతుంది మళ్లీ ఇప్పుడు డయాలసిస్ చేయాలి అంటున్నారు..
 

Read more

Social media & sharing icons powered by UltimatelySocial