మన “లిటిల్ హార్ట్స్ సేవా యువత ” నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా నిన్న అనగా (18-11-2020) బుధవారం “లక్కవరం ఓల్డ్ ఏజ్ హోమ్” లో మల్కిపురం SI నాగరాజు గారు మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించి లిటిల్ హార్ట్స్ సేవా యువత వెబ్ సైట్ ని లాంచ్ చేశారు తరువాత కేక్ కటింగ్ చేసి లిటిల్ హార్ట్స్ సేవా యువత గ్రూప్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు తదుపరి కార్యక్రమం గా ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్దులకు పళ్ళు మరియు బ్రెడ్ అందించడం జరిగింది .. నాలుగు పేద కుటుంబాలను ఆదుకోవడం జరిగింది..
1.సఖినేటిపల్లి మండలం మండలం వివి మేరకు చెందిన చవ్వాకుల పుష్పవతి గారి కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం లిటిల్ హార్ట్స్ 49వ సేవా కార్యక్రమంలో కుట్టు మిషన్ అందించడం జరిగింది..
2.మలికిపురం మండలం ఇరుసుమండ కు చెందిన యడ్ల శ్రీనివాసరావు గారికి వైద్య ఖర్చుల నిమిత్తం లిటిల్ హార్ట్స్ 50 సేవా కార్యక్రమంలో 5,000 రూపాయలు చెక్కు అందించడం జరిగింది..
3.మలికిపురం కి చెందిన భాషా గారి కుటుంబానికి లిటిల్ హార్ట్స్ 51వ సేవా కార్యక్రమంలో నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది.
4.సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర్ర కు చెందిన బెల్లంకొండ శ్రీను గారి కుటుంబానికి లిటిల్ హార్ట్స్ 52వ సేవా కార్యక్రమంలో నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది..
పాలకొల్లు మానవ వేదిక ఓల్డ్ ఏజ్ హోమ్ కి మొక్కలు మరియు వృద్ధుల కి పళ్ళు బ్రెడ్ అందించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మల్కిపురం S.I నాగరాజు గారు, గుండుబోగుల రాము,తోట ప్రసాద్
లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ సభ్యులు బొరుసు సూర్యనారాయణ, మండెల బ్రహ్మాజీ, అబ్బు చిన్నవెంకన్న బాబు, చిట్టాల చిన్నికృష్ణ, బోనం దుర్గాప్రసాద్,గుండుబోగుల సురేష్ ,అడబాల సత్తిబాబు, తిరుమల రాము,అబ్బు త్రిమూర్తులు, జోగి తులసిరామ్ ,బోనం హరీష్,బోనం రమేష్, ముత్యాల నితిన్ సాయి శ్రీనివాస్, ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు
సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు..














