రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి…
లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని రక్తదానం చేస్తే మీరు రక్తదానం చేస్తున్నప్పుడు ఫోటో మరియు మీ వివరాలు మరియు మీరు రక్తదానం చేసిన పేషెంట్ వివరాలు లిటిల్ హార్ట్స్ సేవ యువత ఫేస్బుక్ గ్రూపులో https://www.facebook.com/groups/1741152832850293/?ref=share ఈ లింకు ద్వారా పోస్ట్ చేయండి లేదా +91 95815 82278 వాట్సాప్ నెంబర్ కి పంపించండి మీరు పంపిన ఫోటో మరియు వివరాలు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది..
రక్తం దానం చేసే వారు, చేయాలనుకునే వారు ఎలా తమ పేర్లను నమోదు చేసుకోవాలి?
తరచూ రక్తదానం చేసేవారు, రక్తదానం చేయాలనుకునే వారు మా ఫౌండేషన్ కు సంబందించిన ఈ వెబ్సైటు లో పేర్లను నమోదు చేసుకోవాలి
రక్తం కావాలనుకునే వారు కూడా మా ఫౌండేషన్ వెబ్సైటు లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు..
రక్తదానం వల్ల కలిగే లాభాలు:
రక్తదానం చేసేవారికి తమ సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం దొరుకుతుంది. రక్తదానం చేసేవారిలో గుండెకు సంబందించిన రోగాలు వచ్ఛే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇనుము శాతం పూర్తి నియంత్రణలో ఉంటుంది.
రక్తదానం కేన్సర్ రోగం బారిన పడే అవకాశాల్ని తగ్గిస్తుంది.
రక్తదానం చేయడం వల్ల మన శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దింతో బరువు పెరిగే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు.
రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందని ఇప్పటి వరకూ ఏ అధ్యయనమూ పేర్కొనలేదు. కనుక రక్తదానం నిస్సంకోచంగా చేయవచ్చు. ఆరోగ్యవంతులై కనీసం 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు.. 55 కిలోల బరువుకు తక్కువ కాకుండా ఉన్నవారు రక్తదానానికి అర్హులు. అలాగే, ఆరోగ్యంగా ఉంటే 60 ఏళ్ల వయసు వరకూ కూడా రక్త దానానికి ముందుకు రావచ్చు. పురుషులు అయితే మూడు నెలలకు ఒకసారి, స్త్రీలు నాలుగు నెలలకు ఒకసారి నిరభ్యంతరంగా రక్తదానం చేయవచ్చు.
