ప్రస్థానం

About Us

లిటిల్ హార్ట్స్ సేవ యువత (రిజిస్ట్రేషన్ నెంబర్ 165/2019) 4 సంవత్సరాలుగా కుల,మత,ప్రాంత భేదాలు చూడకుండా కష్టాల్లో ఉన్న నిరుపేదలకి  మానవత్వం తో   సహాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ..

సమాజం పట్ల  బాధ్యతతో నిరుపేదలకి భరోసాగా  నవంబర్ 18  2016 న “లిటిల్ హార్ట్స్ సేవ యువత” స్థాపించడం జరిగింది.

లిటిల్ హార్ట్స్ సేవ యువత నలుగురు స్నేహితుల ఆలోచన నుండి పుట్టి ఈరోజు 40 మంది వాలంటీర్స్ తో కొనసాగుతుంది.

ఇప్పటివరకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో నలభై సేవా కార్యక్రమాలు చేసి నిరుపేదల కి నిత్యవసర వస్తువులు ఆరోగ్యం బాగా లేని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం కొంత డబ్బులు  ఆర్థిక సహాయం చేయడం జరిగింది

ఇప్పటివరకు 3,00,000 రూపాయలు ఉభయగోదావరి జిల్లాలలో కష్టాల్లో ఉన్న నిరుపేదల కి ఆర్థిక సహాయం చేయడం జరిగింది..

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు లిటిల్ హార్ట్స్ 36వ సేవా కార్యక్రమంలో మొత్తం 210 పేద కుటుంబాలకు 75,000 రూపాయలు విలువగల  నిత్యావసర సరుకులు మరియు 200 మందికి భోజనాలు సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, మామిడికుదురు మండలాలలోని నిరుపేదలకు అందించడం జరిగింది..

లిటిల్ హార్ట్స్ సేవ యువత గ్రూప్ చేస్తున్న సేవా కార్యక్రమాలకి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం..

౼ లిటిల్ హార్ట్స్ టీమ్

Social media & sharing icons powered by UltimatelySocial