అమలాపురం జనపెల్లికి చెందిన ఆనంద్ కాళ్లు తిమ్మిర్లు తో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్లారు డాక్టర్లు పరీక్ష చేసి వెన్నుపూస క్యాన్సర్ గా గుర్తించారు అయితే ఈ క్యాన్సర్ ఆరోగ్య శ్రీ లో రాదు 1,50,000 రూపాయిలు ఆపరేషన్ కి ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారు కానీ వల్ల నాన్నగారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆనంద్ మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు వీరిది నిరుపేద కుటుంబం కావడంతో లిటిల్ హార్ట్స్ సేవ యువత నుండి సహాయం కోరగా ఈ రోజు “#లిటిల్_హార్ట్స్_48_వ_సేవ_కార్యక్రమంలో ఆనంద్ కి 10,000 రూపాయిలు చెక్ ” అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవయువత సభ్యులు B.సూర్యనారాయణ ,A.చిన్న వెంకన్నబాబు ,M.బ్రహ్మాజీ పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు.


