38 వ సేవ కార్యక్రమం

38 వ సేవ కార్యక్రమం

మామిడికుదురు మండలం పెదపట్నం లంక కు చెందిన ” గీతిక‌ శరణ్య “(6 సం||)
 
” మోకాలి కేన్సర్” తో గత 8 నెలలుగా బాధపడుతున్నది నవంబర్ 14న పాండిచ్చేరి లోని ప్రఖ్యాత “జిప్మర్” ఆసుపత్రిలో చేరింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ మార్చి నెలలో తిరిగి ఇంటికి పంపించి వేశారు. ప్రభుత్వ సహాయ పధకాల లో లేని వ్యాధి కావటంతో ఆపరేషన్ కు సుమారు పది లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.
 
దురదృష్టవశాత్తు తల్లికి గత సంవత్సరం ఒక కన్ను తొలగించారు..

తండ్రి రావులపాలెంలో తక్కువ జీతం తో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తాడు.
 
“ఆపన్నహస్తాల సాయం” కోరుతూ “రాజోలు” మండలం “మెరకపాలెం” గ్రామం లో పంచాయతీ దగ్గరలో బంధువుల ఇంట ఉన్నారు..
 
గీతిక శరణ్య పరిస్థితి తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ టీమ్ #లిటిల్_హార్ట్స్_38వ_సేవా_కార్యక్రమం_లో_10000_రూపాయలు_ఆర్థికసాయం_చెయ్యడం_జరిగింది
 
ఈ సేవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు…
 
మంచి మనసుతో మీరు కూడా గీతిక శరణ్య కి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.
Social media & sharing icons powered by UltimatelySocial