మేడిచర్లపాలెం (గుడిమెళ్ళంక శివారు) గ్రామానికి చెందిన గుబ్బల వీర వెంకట సత్యనారాయణ (రామ లక్ష్మణ్ ఆటో) అతని భార్య రాధా కృష్ణ కుమారి, తల్లి పద్మావతి, తండ్రి వెంకటేశ్వరరావు. ఈ కుటుంబం ఇప్పుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. భార్యకి రెండు కిడ్నీలు పాడైపోయాయి.
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. దానికి చాలా ఖర్చవుతుంది. దానికి తోడు తల్లి టీబీ తో బాధపడుతోంది. తండ్రికి కాన్సర్, ఈ మధ్యనే ఆపరేషన్ చేసి నాలుకను తొలగించారు. పుట్టెడు కష్టాలలో ఉన్న సత్యనారాయణ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు.
ఈ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు. ఈ కుటుంబానికి ఆసరాగా #లిటిల్_హార్ట్స్_37వ_సేవ_కార్యక్రమంలో 10,000 రూపాయలు ఆర్ధిక సాయం చెయ్యడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ టీమ్ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు.



