71 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 26-01-2020 న #లిటిల్_హార్ట్స్_సేవ_యువత తలపెట్టిన లక్కీ డ్రా కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయింది డ్రా అనంతరం “లిటిల్ హార్ట్స్” సంస్థ గతంలో చేసిన అనేక సేవలను పెద్దలు కొనియాడారు. అదే విధంగా డ్రా అనంతరం నలుగురు పేద వాళ్లు
( 1.) గుబ్బల సత్యనారాయణ (విశ్వేశ్వరయపురం) గారు ఇతను డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు యాక్సిడెంట్ కావడంతో కుటుంబం ఆర్దికంగా వెనుకబడిన కారణంగా 5000 రూపాయలు చెక్కును అందించడం జరిగింది.
(2.) దేవగుప్తాపు సత్యవతి(గూడపల్లి) ఈమె కుమార్తెకు కంటి చూపు లేని కారణంగా కుటుంబ అర్ధిక కష్టాలు చూస లిటిల్ హార్ట్స్ తరుపున 5000 రూపాయల చెక్కును అందించారు.
( 3.)నల్లి నర్సమ్మ (ఇరుసుమండ)ఈమది పేద కుటుంబం మరియు ఇంటికి కరెంట్ కూడా లేని పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉదేశ్యం తో 5000 రూపాయల చెక్కును అందించారు.
(4)యెరుబండి సత్యనారాయణ(లక్కవరం) గారు బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు అని తెలుసుకున్న లిటిల్ హార్ట్స్ సేవ యువత 5000 రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో లిటిల్ హార్ట్స్ సేవ యువత సభ్యులు మాట్లాడుతూ లక్కీ డ్రా ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తమ సంస్థ నుండి ప్రతి నెలా కనీసం ఒక పేద వాడికి సహాయం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అనీ తెలియజేశారు విశ్వేశ్వరయ పురం గ్రామ పెద్దలు గెడ్డం సింహ గారు మరియు సామాజిక సేవ కార్యకర్తలు రావూరి మాణిక్యాలరావు గారు, బోనం రాజు గారు, గుండుబోగుల రాము గారు మరియు లిటిల్ హార్ట్స్ సేవ యువత సభ్యులు పాల్గొన్నారు..





