26 వ సేవ కార్యక్రమం

రాజోలుకు చెందిన దారపురెడ్డి సత్యనారాయణ కుమారుడు సాయి ఇతను వ్యాన్ క్లీనర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. గత నెల 26 న రాజోలు నుండి సూర్యాపేటకు వ్యాన్ పై కొబ్బరి లోడు తీసుకుని వెళ్తుండగా సూర్యాపేట లో వర్షము కారణంగా వ్యాన్ అదుపుతప్పి పడి పోడిపోయిoది. ఈ ప్రమాధoలో దారపురెడ్డి సాయి కంటికి తీవ్రమైన గాయం అయ్యి అతని కంటి గడ్డు బయటకు వచ్చేసింది. ప్రస్తుతం సాయిని విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ నుoడి కామినేని హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. అతని తలకు, కంటికి ఆపరేషన్ చేయడానికి సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికి ఆపరేషన్ చేయిoచేందుకు అంత ఆర్ధిక స్తోమత లేక కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరుతున్నారు. 

లిటిల్ హార్ట్స్ 26 వ సేవ కార్యక్రమంలో 5 వేలరూపాయలు చెక్ రూపంలో #లిటిల్_హార్ట్స్_టీమ్ అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో
#లిటిల్_హార్ట్స్_సేవ_యువత సభ్యులు పాల్గొన్నారు..
 
 
Social media & sharing icons powered by UltimatelySocial